Header Banner

మంచు మనోజ్‌ కేసులో మరో ట్విస్ట్.. మంచు హీరో అసలు టార్గెట్‌ అదేనా?

  Wed Feb 19, 2025 14:35        Entertainment

మంచు మోహన్‌ బాబు పెట్టిన కేసులకు మనోజ్‌ని అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపై ఆయన వివరణ ఇచ్చాడు. ఈ మేరకు వీడియోని పంచుకున్నాడు. ఇందులో తాను అరెస్ట్ కాలేదనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. పోలీస్‌ స్టేషన్‌లోనే మాట్లాడుకుందాం మని పోలీసులతో చెప్పి ఆయనే స్వయంగా స్టేషన్‌కి వెళ్లినట్టు తెలిపారు. తాను తన సిబ్బందితో కనుమ రోడ్‌లోని లేక్‌ వ్యాలీ రెస్టారెంట్‌లో బస చేయగా, పోలీసులు తమ సిబ్బదిని ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, ఒక ఎస్సై, కానిస్టేబుల్‌ తాను సీఎం దగ్గరి నుంచి వస్తున్నా, ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించారని, పోలీస్‌ స్టేషన్‌లో మాట్లాడుకుందని చెప్పి స్టేషన్‌కి వెళ్లగా, అక్కడ ఎస్‌ఐ లేరని తెలిపారు. మనోజ్‌ మాట్లాడుతూ, గతేడాది నుంచి ఏం జరుగుతుందో మీకు తెలిసిందే. ఈ విషయంలో తనని క్షమించాలని, ఎందుకంటే తమ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం, కాలేజ్‌ బయటకు పనిచేసుకుంటున్న ప్రజల కోసం వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఇదంతా చేస్తున్నా అన్నారు మనోజ్‌. `నేను మొదటి నుంచి దాని గురించి మాట్లాడుతున్నా. ఆ విషయాన్ని డైవర్షన్‌ చేస్తూ, నా మీద ఎటాక్‌ చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: రూల్స్.. రూల్స్.. అంటాడు ఈయన పాటించడా.. అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన.!

 

ఇందులోకి నా కుటుంబ సభ్యులను లాగుతున్నారు. ఒక మనిషిని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో, అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్నారు. తాను భయపడతాడనుకుంటున్నారు. కానీ ఈ జన్మకి అది జరగని పని. నేను ఏతప్పు చేయలేదు, కానీ నా మీద, నా భార్య మీద 32 కేసులు పెట్టారు. ఢిల్లీ నుంచి, కోర్టుల నుంచి, కలెక్టర్‌ ఆఫీస్‌ లనుంచి కేసులు పెడుతున్నారు. అన్నీ భోగస్‌ కేసులే. నిజానికి ఒకే వెర్షన్‌ ఉంటుంది. అబద్దానికి అన్ని వెర్షన్స్ ఉంటాయి` అని చెప్పారు మనోజ్‌. వాళ్లు బౌన్సర్లని వేసుకుని మా వాళ్లని, ఊరు వాళ్లని, స్టూడెంట్స్ ని కొడుతున్నారని చెబుతూనే వస్తున్నా. ఇటీవల తాను రాయచోటికి ఒక ఫంక్షన్‌కి వెళ్లినప్పుడు, అక్కడి వారంతా ఆ ఫంక్షన్‌కి వచ్చి, ఒక వ్యక్తి రాకుండా వ్యాపారం చేసుకుంటుంటే, ఆయన స్టోర్‌లోకి దూరి మొత్తం డ్యామేజ్‌ చేశారు. అక్కడి స్టూడెంట్స్ కొట్టారు. అద్దాలన్నీ పగలగొట్టారు. చాలా ధ్వంసం చేశారు. తన వద్ద చాలా వీడియోలున్నాయి. వాటిని చంద్రగిరి సీఐ గారికి పంపించాను. ఈ ఘటనపై పోలీసులకు కంప్లెయింట్‌ ఇచ్చినా తీసుకోవడం లేదు. ఏవేవో సాకులు చెబుతున్నారు. తమ సినిమా టీమ్‌ మూడు రూమ్ లు తీసుకుని ఉండగా, అర్థరాత్రి ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ వచ్చి ఇక్కడెందుకు ఉన్నారని ప్రశ్నించారు. తాను సీఎం ఆఫీస్‌ నుంచి వస్తున్నానని చెప్పాడు. ఆ తర్వాత ప్రశ్నించగా తాను సీఎం భందోబస్త్ పూర్తి చేసుకుని వస్తున్నానని చెప్పాడు. అర్థరాత్రి మాతో వాగ్వాదం దిగే నేపథ్యంలో పోలీస్‌ స్టేషనకి వెళ్లి మాట్లాడాదామని చెప్పాను.

 

ఇది కూడా చదవండి: గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

స్టేషన్‌లో సీసీ కెమెరాలుంటాయి. డీజీపీగారికి లింక్‌ అయి ఉంటాయని చెప్పగా, స్టేషన్‌ వరకు వచ్చి ఆ తర్వాత వెళ్లిపోయారు. పోలీస్‌ స్టేషన్‌ లోపలికి వెళ్లి హెడ్‌ కానిస్టేబుల్‌తో ఫోన్‌ చేయిస్తే ఆయన ఫోన్‌ లిఫ్ట్ చేయలేదు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. అక్కడ జరిగింది ఇది. కావాలంటే ఆ ఫూటేజీ తెప్పించుకుని చూడండి` అని తెలిపారు మంచు మనోజ్‌. తాను అరెస్ట్ అయ్యాననే దానికి ఆయన వివరణ ఇచ్చారు. అయితే మనోజ్‌ ఇదంతా ఎందుకు చేస్తున్నారనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. తన యూనివర్సిటీలో అవకతవకలకు సంబంధించి అయితే ఓకే, బయటి జనం గురించి ఆయన ఎందుకు రియాక్ట్ అవుతున్నారు. బయట ప్రైవేట్‌ హాస్టల్స్ గురించి ఆయన ఎందుకు రియాక్ట్ అవుతున్నారనేది ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఇందులో ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. మంచు మనోజ్‌ అసలు పోరాటం ఇదంతా కాదని, ఆయన ఆస్తుల కోసమే ఇదంతా చేస్తున్నారని మంచు మోహన్‌ బాబు వర్గం నుంచి తెలుస్తున్న సమాచారం. మోహన్‌బాబుకి ఎంబీ యూనివర్సిటీతోపాటు శ్రీ విద్యానికేథన్‌ స్కూల్స్ కూడా ఉన్నాయి. అయితే విష్ణు యూనివర్సిటీ చూసుకుంటున్నాడు, తనకు స్కూల్స్ ఇవ్వాలని మనోజ్‌ అడుగుతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇదంతా ఫ్యామిలీ ఆస్తుల గొడవలని అంటున్నారు. మోహన్‌బాబు ఈ విషయంలో ససేమిరా అంటున్నారని, మనోజ్‌కి ఇచ్చేందుకు ఆసక్తి చూపించడం లేదని తెలుస్తుంది. అందుకే మనోజ్‌ ఇదంతా చేస్తున్నారని సమాచారం. మరి నిజం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఈ వివాదం మాత్రం నిత్యం రాజుకుంటూనే ఉంది. 

 

ఇది కూడా చదవండి: జగన్‌కు మరో బిగ్ షాక్.. వైసీపీ కీలక నేత అరెస్ట్! పోలీసులు వెంటనే రంగంలోకి..

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

 

అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీలో 5 సంస్థలు...2 వేల కోట్ల పెట్టుబడులు! వేలల్లో ఉద్యోగ అవకాశాలు!

 

మిగిలింది మ‌రో 8 రోజులే.. దేశ‌వ్యాప్తంగా రోడ్ల‌న్నీ ప్ర‌యాగ్‌రాజ్ వైపే..

 

జగన్‌కు మరో బిగ్ షాక్.. త్వరలోనే వైసీపీ నేత మాజీ మంత్రి అరెస్ట్! వారి అరెస్టుతో కూటమి శ్రేణుల్లో ఆనందం!

 

డిప్యూటీ సీఎం పవన్ తో సీనియర్ నటుడు మర్యాదపూర్వక భేటీ! కారణం ఇదే!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KinjarapuRamMohanNaidu #Guntur #Pressmeet #AndhraPradesh